తెలుగు ప్రజలకు "కిక్కె కిక్కు"
బంపర్ ఆఫర్....బంపర్ ఆఫర్
మన రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం ఒక బుంపర్ ఆఫర్ ఇవ్వబొతున్నందుకు నాకు చాలా సంతొషంగా వుంది..
దేశంలొ సామాన్య ప్రజలు నిత్యావసర సరుకులు, దినుసుల రేట్లు పెరిగి అస్టకష్టాలు పడుతున్నారు. ఇది తెలిసికూడా కేంద్ర ప్రభుత్వం ఎం చేయలెని స్థితిలొ కొట్టుమిట్టాదుతొంది. ఇటువంటి కష్ట సమయం లొ మన ప్రభుత్వం పని తీరు చూసి ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు నేర్చుకోవల్సింది ఎంతైనా వుంది.
పెరుగుతున్న ధరలకు విరుగుడుగా, అదే సమయంలో ప్రజలను ఆనందంగా వుంచటానికి మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్నయం అభినందనీయం. ఆర్ధిక మంత్రి నుండి సీ.యం అయిన మన రొశయ్యగారు మద్యం ను ప్రస్తుత ధర (రు.45/-) తగ్గించి రు.35/- కె అందేలా ఎర్పాటు చేస్తున్నారు. ఇక ఎంచక్క అందరు కుటుంబ సమేతంగ తాగి అటు రాష్ట్ర ఖజానా నింపవచ్చు పనిలోపనిగా తమ నెలసరి ఖర్చులను అదుపులొ వుంచుకోవచ్చు.
ఈ సందర్భం లొ నేను కూడ మన రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ప్రజానికానికి కొన్ని సూచనలు, సలహాలు పంపించాలనుకుంటున్నాను. అవి:
1. మన రాష్ట్రంలొ ఎన్నో 'మధ్యాన భోజన పధకం' క్రింద నడుపబడుతున్న పాఠశాలలకి సరఫరా చెస్తే, అటు వాతికి కేటాయించిన బుడ్జెట్ మిగులుతుంది. ఇటు ఆశించిన ఆదాయం వస్తుంది.
2. ఎటూ పాల ధరలు కూడా పెరుగుతయ్ కాబట్టి పాల బదులు ప్రజలకు మద్యం (బీర్ ఐతే బెటర్.....ప్రొద్దున్నే బార్లీ నీళ్ళు...ఆరొగ్యానికి మంచిది) అలవాటు చెస్తే ఇక ఆదాయమే ఆదాయం.
3. ప్రభుత్వ ఆస్పత్రులలొ రోగులకు మందుల బదులు ఇదే ఇస్తే వారికి నొప్పులు బాదలు లేకుండా హాయిగా వుంతారు....పైపెచ్చు "ఆరోగ్యశ్రి" నిధులు మిగులుతాయి.
4. ఇవాళ దేశంలో "చిన్న కారు" హవా నడుస్తొంది. ఎటూ ఇంధనం (పెట్రొల్, డీసెల్, గ్యాస్ మొ..) ధరలు కుడ పెరిగాయి కనుక మనం మద్యం తో నదిచే కారు కనిపెడితే బుంపెర్ హిత్ అవుతుంది.
నా ఈ సూచనలను కనుక అమలుపరిచినట్టైతె తప్పకుండ మన రాష్ట్రం యొక్క ఆదాయం అంచనాలను మించుతుందని తద్వారా మనం అమెరికా, రష్య, చైనా తదితర అగ్ర దేశాలకు అప్పు ఇచే స్థాయికి ఎదుగుతామని సవినయంగా మనవి చేసుకుంటున్నాను.









0 comments:
Post a Comment