ఏ మతమైనా ఎమున్నది గర్వకారణం
కొంతకాలంగా హిందూ స్వాములు మతాన్ని అడ్డుపెట్టుకుని చేసిన వేషాలు మోసాలు వెలుగుచూశాయి. అవి మరువక ముందే క్రైస్తవ మతంలో కొన్ని వికెట్లు పడ్డాయి. కొంతమంది బ్లాగర్లు హిందూ స్వాములగురించి, హిందూ మతం గురించి వారికి మాత్రమే వచ్చిన రీతిలో ఎండబెట్టారు. మరి వారు ఇపుడెందుకు మౌనంగా వున్నారో వారికే తెలియాలి.
రెండు అత్యంత హేయమైన సంఘటనలు వెలుగు చూసాయి. వాటికి క్రైస్తవ మతం లో అత్యంత పవిత్ర స్తలంగా భావించే "వాటికన్ సిటి" కి సంబందించినవారే వుండతం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
మొదటి సంఘటన..... ఏంజెలో బాల్డూసి, వాటికన్ సిటి లోని మత పెద్దలకు తరతరాలుగా సహాయకులుగా చేసిన వంశం లోనివాడు..ఇతను వ్రుత్తి రిత్యా ప్రభుత్వ కాంట్రాక్టులు చేసే వ్యాపారవేత్త....ఇప్పటికీ మత పేద్దలకు సహాయకుడిగా కొనసాగుతున్నాడు. ఇతను చేసిన కాంట్రాక్టులకు సంబందించి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నాడు...దీనికి సంబందించి జరిపిన విచారణ లో భాగంగా ఎప్రిల్ 14, 2008 నుండి జనవరి 20, 2010 మధ్య లో ఈతని ఫొను సంభాషణలను రికార్డ్ చేసారు. ఆ సంభాషణల ఆధారంగా ఇతడు "మగ వ్యభిచారు"లను పై వారికి సప్ప్లయి చేసినట్లు బైటపడింది. ఈతనికి వాటికన్ లోని ప్రార్థన కచేరి కి చెందిన గాయకుదు "థొమస్ ఛినెదు ఏహిఎం" కూదా భాగస్వమి అని బైటపదినది. ఈ సంఘటన వాటికన్ లోని మతపెద్దల శీల, స్వభావాలపై అనుమానాలు రేకెత్తించింది.
రెండవది......క్రైస్తవుల ప్రత్యక్ష దేవుడైన పోప్ బెనెడిక్త్ Xవీ అన్న అయిన 'జార్జ్ రాటింజెర్ ' ఒక క్రైస్తవ మిషనరి స్కూల్ నడుపుతున్నాడు. 1964 నుండి 1994 వరకు రాటింజెర్ డైరెక్టెర్ గా చేసాడు. ప్రస్తుత పోప్ 1977-1981 మధ్య కాలం లో జర్మని లోని మ్యునిచ్ నగర ఆర్చి బిషప్ గా చేసాడు.ఆ సమయంలోనే, చర్చ్ లోని స్కూల్ లో చదువుకునే, కచేరీ లో పాడే పిల్లపై శారీరకంగా మరియు మానసికంగా లైంగిక వేదింపులు జరిగాయని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.ఈ విషయం ప్రస్తుత పోప్ కు తెలుసుననేది మరింత కలవరపరిచే అంశం.
హిందూ మతం గురించి ఆడిపోసుకుని ....మా మతం అని చంకలు గుద్దుకునేవాళ్ళు ఇపుడు ఎలా స్పందిస్తారో చూడాలి...







0 comments:
Post a Comment